ఈటెలకు ముందు నుయ్యి వెనుక గొయ్యి..?

తెలంగాణ రాష్ట్ర ద్యేయంగా ఉద్యమంలో పని చేసిన నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర.రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి నేతలకు ఎదురు నిలబడి.తన పంతాన్ని నెగ్గించుకున్న ఘటికుడు ఈటెల.లెఫ్టిస్టు భావజాలం కలిగిన ఈటల.టీఆర్ఎస్ పార్టీ పుట్టిన దగ్గరి నుంచి అందులోనే గెలుస్తూ వచ్చారు.టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి వివిధ శాఖలు చేపట్టారు.

 Etela Behind The Ghee Before The Spears , Cm Kcr, Mla Etala Reajendra, Huzurabad-TeluguStop.com

కరోనా టైంలో ఆరోగ్య శాఖను సమర్థవంతంగా నిర్శహించారు.ప్రతి వార్డులోకి తిరుగుతూ రోగుల్లో భరోసా నింపారు.

సీఎం కేసీఆర్ కు.ఈటల రాజేంద్ర కు ఎక్కడ చెడిందో కానీ ఆయన్ను పొమ్మనలేక పార్టీలో పొగ పెట్టారు.మంత్రి పదవి నుంచి తప్పించి అనేక ఇబ్బందులకు గురి చేశారు.దాంతో ఆయన పార్టీకీ, పదవికి రాజీనామా చేసి.ఉప ఎన్నికలకు వెళ్లారు.బీజేపీలో చేరి విజయం సాధించారు.

అయితే తన సిద్దాంతం, బీజేపీ సిద్దాంత వేరైనా.సీఎం కేసీఆర్ ను గద్దె దించాలంటే.

ఉన్న ఒకే ఒక పార్టీ బీజేపీ కావడంతో.కాషాయం కండువా కప్పుకున్నారు.

అయితే అక్కడ కూడా ఏమైందో కానీ ఈటల పెద్ద కంఫర్ట్ గా బీజేపీని భావించడం లేదు.

Telugu Brs, Cm Kcr, Huzurabadmla, Harish Rao, Mlaetala, Revanth Reddy-Politics

ఆ మద్యన బీజేపీలో కూడా టీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారంటూ పెద్ద బాంబు పేల్చారు.దాంతో ఆయన బీజేపీలో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.దాంతో ఆయన బయటకు రాలేక.

అక్కడే ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్నారని.ఆయన అనుచరులు చెబుతున్నారు.

బీజేపీని కాదని బయటకు వస్తే.ఈటలను ఇబ్బంది పెట్టేందకు కేసీఆర్ కాచుకుని కూర్చున్నాడు.

కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామంటే.అక్కడ పరిస్థితి నానాటికి దిగజారి పోతోంది.

అందుకే ఆయన సొంత పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కూడా ఆమధ్యన వార్తలు వచ్చాయి.

Telugu Brs, Cm Kcr, Huzurabadmla, Harish Rao, Mlaetala, Revanth Reddy-Politics

బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు కూడా పొగపెడుతున్నారని తెలుస్తోంది.ఆయన కూడా బయటకు రావడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.అయితే ఆయన బయటకు వచ్చినా.

ఏపార్టీలో చేరే అవకాశం లేదు.దాంతో ఈటలతో.

హరీష్ ములాఖత్ అయి కొత్త పార్టీని పెట్టే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.కొత్త పార్టీ విషయం ఏమోగానీ.

ఈటల మాత్రం బీజేపీని విడిచే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.దానికి తోడు బీజేపీలోనే మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామితో ఆయనకు అస్సలు పొసగడం లేదు.

అందుకే సరైన టైం చూసీ కండువా మార్చడానికి ఆయన రెఢీ అవుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.మరి ఆయన పార్టీ మారుతారా.? లేక బీజేపీ పగ్గాలను తీసుకుంటారా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube