తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కేసీఆర్ గణతంత్ర దినోత్సవ వేడుకలను విస్మరించి, ప్రజలను, రాజ్యాంగాన్ని అగౌరవ పరిచారన్నారు.
అంతేకాకుండా గవర్నర్ వ్యవస్థను సైతం అవమానించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఎంతో వైభవంగా నిర్వహించాల్సిన రిపబ్లిక్ డే వేడుకలను జరపకుండా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ తన రాజకీయాల కోసం ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.సీఎంగా కొనసాగే అర్హత కేసీఆర్ కు లేదని షర్మిల వ్యాఖ్యనించారు.







