జాతీయ పార్టీగా పేరు మార్చుకున్న బీఆర్ఎస్ దూకుడు పెంచింది.ఖమ్మంలో ఇటీవల తొలి ఆవిర్భావ సభను నిర్వహించిన బీఆర్ఎస్ ఇప్పుడు మహారాష్ట్రలో సభ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఈ మేరకు నాందేడ్ లో ఫిబ్రవరి 5వ తేదీన సభను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.ఈ సభకు మహారాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రజలు కూడా భారీ సంఖ్యలో హాజరు అవుతారని సమాచారం.
కాగా నాందేడ్ ఆవిర్భావ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, జుక్కల్ ఎమ్మెల్యే పరిశీలించారు.