టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయం అక్కర్లేదు.తెలుగుతోపాటు బాలీవుడ్ లో కూడా సమంతకి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సమంతకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఇది ఇలా ఉంటే సమంత గత కొన్ని నెలలుగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.
ఇప్పుడిప్పుడే ఆ సమస్య నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది.ఆ సమస్య నుంచి కోలుకుంటూనే మరొకవైపు సినిమాలలో బిజీబిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.
కాగా సమంత మయూసైటిస్ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆమె అలాగే ప్రమోషన్స్ ను చేసిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.ఇకపోతే ఇటీవలె సమంత యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
సమంత నటించిన మరో సినిమా శాంకుతలం.ఇప్పటికే ఈ శాంకుతలం సినిమా షూటింగ్ పూర్తి అయిన విషయం తెలిసిందే.ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచునాలు నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కాగా గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.ఇదివరకే ఈ చిత్రం నుంచి మల్లికా మల్లికా అంటూ సాగే మెలోడీ సాంగ్ ఆకట్టుకుంది.
ఇది ఇలా ఉంది తాజాగా ఈ సినిమా నుంచి మరొక సాంగ్ విడుదల అయ్యింది.తాజాగా ఈ సినిమా నుంచి ఋషివనములోనా అనే మరో లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది.
ఈ సినిమా నుంచి రెండో సింగిల్ పాటను మేకర్స్ విడుదల చేశారు.ఈ సాంగ్‌లో రిలీజై అభిమానులను ఆకట్టుకుంటోంది.







