పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నాడు.ఈయన లైనప్ చూసి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు.అది కూడా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.
ఇక ఈ సినిమా షూట్ ఇప్పటికే 70 శాతానికి పైగానే పూర్తి అయ్యింది.ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ షూట్ లో పాల్గొనడంతో శరవేగంగా షూట్ జరుగుతుంది.మరి ఈ సినిమాను ఏ ఎం రత్నం పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండడం విశేషం.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి రిపబ్లిక్ డే సందర్భంగా టీజర్ ఉంటుంది అని స్వయంగా నిర్మాతే చెప్పడం ఆసక్తిగా మారింది.

అయితే రేపు రిపబ్లిక్ డే ఇంకా ఈ సినిమా నుండి అప్డేట్ వస్తుంది అని ఎలాంటి వార్తలు వినిపించడం లేదు.అధికారికంగా మేకర్స్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.ఈ సినిమా నుండి కొత్త టీజర్ రిలీజ్ అవుతుంది అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.మరి ఇప్పటిదాకా క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ కలిగిస్తారా అని చర్చ జరుగుతుంది.

మరి చిత్ర యూనిట్ ఈ రోజు అయిన అప్డేట్ ఇస్తారా లేదా అని వైట్ చేయాలి.ఈ రోజు ఎలాంటి అప్డేట్ రాకపోతే ఇక ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందే.ఇది పక్కన పెడితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.ఈ సమ్మర్ లో అయినా ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో వేచి చూడాలి.







