టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలతోఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం కోసం వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించుకున్న సంగతి తెలిసింది.
ఇక ఈ వారాహికి కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా ఇక్కడ మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ వారాహి ప్రచార వాహనం గురించి రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా వారాహి గురించి రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు చైతన్య రథం మీద తిరిగితే మీరు పంది బస్సు మీద తిరుగుతున్నారంటున్న తప్పుడు నా కొడుకులందరినీ జనసేన బస్సు టైర్ల కింద తొక్కించండి సార్ అలా కాకపోతే కేసులైన పెట్టండి.ఇది మీ ఫ్యాన్ గా నా విన్నపం అంటూ వర్మ ట్వీట్ చేశారు.గుడిలో ఉంటేనే అది వారాహి రోడ్డు మీదకు వస్తే పంది.
పవన్ కళ్యాణ్ తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం పూర్తిగా తనని అవమానపరిచినట్లేనని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి.

ఈ విధంగా మొరుగుతున్న కుక్కల నోర్లు మూయించకపోతే మన పవిత్ర వారాహిని పంది బస్సుగా మార్చేస్తారు.జై పీకే జై జనసేన అంటూ మరొకటి ట్వీట్ చేశారు.ఆ వెంటనే జనసేన సైనికులారా దయచేసి #PandhiBassuVaarahi హ్యాష్‌ట్యాగ్ ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండని కూడా వర్మ వరుస ట్వీట్లు చేస్తూ రెచ్చిపోయారు.
దీంతో కొందరు జనసేన అభిమానులు స్పందిస్తూ వర్మను దారుణంగా ట్రోల్ చేస్తూ తన ట్వీట్స్ పై మండిపడుతూ వర్మ ఎవరికో అమ్ముడుపోయారు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం వర్మ కు సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా వర్మ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







