అమెరికన్ తెలుగు అసోసియేషన్ కొత్త అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు చేపట్టారు.లాస్ వేగాస్లోని ది మిరాగ్ లో శనివారం జరిగిన ఆటా బోర్డ్ మీటింగ్ లో ప్రస్తుత అధ్యక్షురాలు భువనేష్ భూజల చేతుల మీదుగా మధు బొమ్మినేని నూతన అధ్యక్షురాలుగా బాధ్యతలను చేపట్టారు.
ఈ సమావేశానికి యూఎస్ లోని అన్ని పరిసర ప్రాంతాల నుంచి ఆటా డైరెక్టర్లు, సలహాదారులు, మాజీ అధ్యక్షులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నార్త్ కరోలినా ప్రాంతానికి చెందిన మధు బొమ్మినేని 2004 నుంచి ఆటా లో చురుగ్గా ఉండడంతో పాటు ఆటా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాంటి అనేక పదవులలో సేవలు అందించారు.2023 జనవరిలో ఆటా లోని16 బోర్డు ఆఫ్ ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.ఎన్నికలైనా సభ్యులు నాలుగు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతున్నారు.
అనిల్ బోదిరెడ్డి సన్నీ రెడ్డి, కిరణ్ పాశం, కిషోర్ గూడూరు, మహిధర్ ముస్కుల, నర్సిరెడ్డి గడికొప్పుల, రామకృష్ణారెడ్డి అల, రాజు కక్కెర్ల, సాయి సుధీని, శ్రీకాంత్ గుడిపాటి, నర్సింహారెడ్డి ధ్యాసని, రఘవీర్ మరిపెద్ది, సాయినాథ్ బోయపల్లి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ దర్గుల, వినోద్ కోడూరు బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులుగా ఎన్నికవ్వడం విశేషం.
ఆటా బోర్డ్ ఏకగ్రీవంగా జయంత్ చల్లను కాబోయే ప్రెసిడెంట్ గా ఎన్నుకుంది.ఆటా 2023, 2024 టర్మ్ కి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి అల కార్యదర్శిగా, సతీష్ రెడ్డి కోశాధికారిగా, తిరుపతిరెడ్డి యార్రం రెడ్డి జాయింట్ సెక్రెటరీ గా ,రవీందర్ గూడూరు జాయింట్ ట్రెజరర్ గా, హరిప్రసాద్ రెడ్డి లింగాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వీళ్ళందరూ కూడా ఎన్నికయ్యారు.