హైదరాబాద్ లోని రాంగోపాల్ పేట అగ్నిప్రమాదం జరిగిన భవనం కూల్చివేతకు రంగం సిద్ధమైంది.ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు.1,890 చదరపు అడుగుల్లో ఉన్న నిర్మాణాన్ని అధికారులు కూల్చాలని కోరుతున్నారు.కాగా ఈ కూల్చివేత ప్రక్రియకు రూ.33,86,268 అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు.అదేవిధంగా కూల్చివేతకు అధునాతన యంత్రాలు సమకూర్చుకోవాలని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రమాద సమయంలో భవనంలో మిస్సయిన ఇద్దరు ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇద్దరీ ఆచూకీపై స్పష్టత రాగానే కూల్చివేతకు ఏర్పాట్లు చేస్తున్నారు.







