తెలుగు సినీ నటి, బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది.
కొన్ని సినిమాలలో హీరోయిన్ గా మరికొన్ని సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా చేసింది.ఇకతొలిసారిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.
ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో అతిథి పాత్రలో నటించింది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించింది.ఇక ఎన్నో సినిమాలలో కొన్ని పాత్రలలో నటించి గుర్తింపు అందుకుంది.
ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నగా.బిగ్ బాస్ హౌస్ లో ఈమె చేసిన రచ్చ మాత్రం అందరికీ తెలిసిందే.
అంతేకాకుండా హౌస్ లో ఉన్నంత కాలం కాస్త గ్లామర్ షో లతో బాగా ఎక్స్పోజ్ చేసింది.ఇక ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.అంతేకాకుండా ఆ ఫోటోలతో యువతను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది.
పొట్టి పొట్టి బట్టలతో హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తే రెచ్చిపోతుంది.తాను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు క్షణాలో వైరల్ అవుతూ ఉంటుంది.

ఇక ప్రస్తుతం బుల్లితెరపై బిబి జోడిలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తో కలిసి డాన్స్ చేస్తుంది.ప్రస్తుతం బుల్లితెరపై ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది.నిజానికి తమ డాన్సులతో అందర్నీ బాగా ఫిదా చేస్తున్నారు.ఇంతకాలం తమలో దాచుకున్న టాలెంటును ఈ విధంగా బయటపెడుతున్నారు.ఎప్పుడైతే ఈ షోలో జోడిగా వీరిద్దరూ ఉన్నారో అప్పటినుంచి వీరిద్దరూ బయట కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో కూడా ఇద్దరు సందడి చేసిన వీడియోలు బాగా పంచుకుంటున్నారు.మొత్తానికి ఈ షోతో ఇద్దరు బాగా క్లోజ్ అవుతున్నారు.ఎంతలా అంటే ఇద్దరు ప్రేమలో ఉన్నారేమో అన్న అనుమానాలు వస్తున్నాయి.
కొన్ని కొన్ని సార్లు వీళ్ల ప్రవర్తన కూడా అలాగే కనిపిస్తుంది.తాజాగా తేజస్వి తన సోషల్ మీడియా వేదికగా ఇద్దరు కలిసి ఉన్న వీడియోను పంచుకుంది.
ఇక ఆ వీడియోకు అఖిల్ ట్యాగ్ చేయగా.అఖిల్ ఆ వీడియోని రీ పోస్ట్ చేస్తూ అన్ కండిషనల్ లవ్ అని అంటే అనవసరమైన ప్రేమ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
దానిని స్టోరీ రూపంలో పంచుకోగా ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.ఇక మీరిద్దరికీ మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడటంతో వీరి అభిమానులు వీరికి ఫ్యాన్ పేజ్ కూడా క్రియేట్ చేశారు.