మొత్తానికి నిన్నటితో ముగిసిన కార్తీకదీపం సీరియల్ ఆరు సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను ఎంతలా కనెక్ట్ చేసుకుందో చూసాం.భవిష్యత్తులో కూడా ఈ సీరియల్ లోని పాత్రలు వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత లు గురించి కూడా మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే ఈ పాత్రలు ప్రేక్షకులను అంతలా ఆకట్టుకున్నాయి కాబట్టి.ఇక ఈ సీరియల్ అనగానే ఆ సమయంలో ఏ పనులున్న వదిలేసుకొని మరి ఆడవాళ్లంతా వచ్చి టీవీల ముందు వాలుతుంటారు.
ప్రారంభం నుండి ఈ సీరియల్ ఒకటే కాన్సెప్ట్ తో కొనసాగింది.అలా చివరి వరకు కథ అలాగే నడవగా చివర్లో మొత్తానికి వంటలక్క మోనితను చంపేసి కథను గెలిపించి శుభం పలికించింది.
ఇక ఈ మూడు పాత్రలో నటిస్తున్న నటులు ఈ సీరియల్ ద్వారా మంచి అభిమానం పెంచుకున్నారు.

ఇక విలన్ పాత్రలో నటిస్తున్న మోనితను కూడా బాగా ఇష్టపడతారు ప్రేక్షకులు.చివరి వరకు ప్రేమించిన వ్యక్తిని కాదనకుండా మరెవరిని పెళ్లి చేసుకోకుండా కార్తీక్ అనే పేరుతోనే ప్రాణాలు విడిచింది.కానీ తాజాగా ఆమె నిజంగానే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసింది.
ఇక మోనితను చేసుకునే అదృష్టవంతుడు ఎవరు చూద్దాం.ఇక మోనిత అసలు పేరు శోభ శెట్టి.
ఈమె కన్నడకు చెందిన ముద్దుగుమ్మ.తొలిసారిగా శోభ శెట్టి కన్నడ, తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా అడుగు పెట్టింది.
ఏ సీరియల్ కు అందుకోనంత గుర్తింపు కార్తీకదీప తోనే అందుకుంది శోభ.పైగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది.తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.అందులో తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.
కార్తీక దీపం సెట్ లో చాలా వీడియోలను తీసి అభిమానులకు పంచుకుంది.ఇక గత ఏడాది ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించగా ఆ సీరీస్ బాగా ఆకట్టుకుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా.ఒక వీడియో పంచుకుంది శోభ.అదేంటంటే తన పెళ్లి చూపులు అంటూ అందరికీ షాక్ ఇచ్చింది.తాను వేసుకున్న మేకప్ నుండి తన ఇంటికి వచ్చిన బంధువుల వరకు వీడియోలు చేయగా అందులో మెయిన్ వరుడును చూపించకుండా షేర్ చేసింది.తయారైన విధానాన్ని, తన చీర కట్టును మొత్తం చూపించండి.తన ఇంటికి వచ్చిన తన అత్తగారి బంధువులు భోజనం చేస్తున్న దృశ్యాలను, పలు దృశ్యాలను వీడియోలు రికార్డ్ చేసి అభిమానులతో పంచుకుంది.
ఇక ఆ వీడియో చూసిన తన అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.హార్ట్ బ్రేక్ చేస్తున్నావు అంటూ కామెంట్లు పెట్టారు.అయితే కార్తీకదీపం అభిమానులు మాత్రం.కార్తీక్ ను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నావా.
అయితే కార్తీక్ కు చెప్తాము అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.







