అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రం వెనక్కి వెళ్లింది.అల్లవరం మండలం ఓడరేవులో సుమారు 30 మీటర్ల మేర సముద్రపు నీరు వెనక్కి వెళ్లిందని తెలుస్తోంది.
రెండు రోజుల ముందు ముందుకు వచ్చిన సముద్రం ఓఎన్జీసీ ప్రహరీని తాకింది.దీంతో సమీపంలోని రోడ్లు కోతకు గురైయ్యాయి.
అయితే అనూహ్యంగా నిన్నటి నుంచి సముద్రపు నీరు వెనక్కి వెళ్తుంది.బంగాళాఖాతంలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో సముద్రం ముందుకు, వెనుకకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.







