ఈజీ మనీ అంటే ఎవరికవసరం లేదు.ఈరోజుల్లో కస్టపడి సంపాదించేవారికంటే షార్ట్ కట్స్ లో సంపాదించేవారే ఎక్కువ అయిపోయారు.
ఇదే విషయాన్ని కొంతమంది కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.కాలం మారేకొద్దీ మోసాలు చేసే తీరు కూడా మారిపోతోంది.
టక్నాలజీ దీనికి ఆజ్యం పోసిందని చెప్పుకోవచ్చు.అతడు ఓ ఐటీ ఉద్యోగి.
సంపాదన నెలకు లక్షల్లోనే.అయినా ఊరికే డబ్బు వస్తుందని టెంప్ట్ అయ్యాడు.ఇంకేముంది, కట్ చేస్తే… రూ.19 లక్షలు అతని అకౌంట్ నుండి మాయం అయ్యాయి.అదెలాగో తెలియాలంటే మీరు ఈ కథను చదవాల్సిందే.

సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాలు … కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) చెందిన బాధితుడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతనికి జనవరిలో వాట్సాప్‌లో ఒక మెసేజ్ రాగా దురదృష్టం కొద్దీ ఆ మెసేజ్ చదివాడు.“యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే ఒక్కో వీడియోకీ లైక్ కొడితే రూ.50 చొప్పున కమీషన్ ఇస్తాము” అనేది దాని సారాంశం.మొదట అతగాడు నమ్మలేదు.
తర్వాత నిజమేనేమో అని భ్రమపడి లైకే కదా.కొడితే పోలా? అని అనుకున్నాడు.ట్రై చేద్దాం అనుకున్నాడు.ముందుగా నేరగాళ్లు… 3 వీడియోల లింకులు పంపారు.అవి యూట్యూబ్ లింకులా కాదా అని గమనించి మరీ లైక్స్ కొట్టాడు.వెంటనే తన బ్యాంక్ అకౌంట్ నంబర్ కి రూ.150 వచ్చాయి.

దాంతో గబగబా మరో 10 వీడియోలకు లైక్స్ కొట్టేశాడు.అయితే ఈసారి మనీ రాలేదు.ఎందుకని వారిని అడగగా తన దగ్గర పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనీ, అందుకు రూ.600 ఖర్చు అవుతుంది అని అన్నారు.ఇదే క్రమంలో ప్రిపెయిడ్‌గా మరో రూ.3000 పంపితే, రూ.4,750 రిటర్న్ ఇస్తామని చెప్పారు.ఈ మోసాన్ని అతగాడు పసిగట్టలేదు.వెంటనే రూ.3000 పంపగా అతని అకౌంట్ లోకి రూ.4,750 వచ్చి పడ్డాయి.దాంతో ఎగిరి గంతేసి వారు మరలా రూ.1.80 లక్షలు పంపితే… రూ.3.24 లక్షలు రిటర్న్ ఇస్తామని చెప్పగా వాళ్లు కోరినట్లే.రూ.1.80 లక్షలు చేసి రూ.3.24 లక్షలు పొందాడు.ఈసారైతే ఏకంగా గాల్లో తేలాడు.ఈసారి అవతల కేటుగాళ్లు మరో మెసేజ్ పంపారు.రూ.18.90 లక్షలు ప్రీపెయిడ్ కడితే.ఏకంగా రూ.27 లక్షలు ఇస్తామని చెప్పారు.దాంతో మనోడు ఊహల్లో తేలిపోయి వాళ్లు కోరినట్లు చెల్లించాడు.
ఇంకేముంది పధకం ప్రకారం సైబర్ నేరగాళ్లు వాళ్ళు అనుకున్నంత డబ్బు కొట్టేసి ఇతగాడికి టోపీ పెట్టేసారు.కాగా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.







