పెళ్లి తర్వాత ప్రతి మహిళ అమ్మ అనే పిలుపు కోసం ఎంతగానో ఆశ పడుతుంది.మరెంతగానో ఆరాటపడుతుంది.
కోరుకున్నట్లుగానే ప్రెగ్నెన్సీ వస్తే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు.అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహారం విషయంలో అనేక నియమాలు పాటించాలి.ఇకపోతే గర్భధారణకు సంబంధించిన చాలామందికి అనేక అపోహలు, అనుమానాలు, సందేహాలు, రకరకాల ప్రశ్నలు ఉండటం సర్వసాధారణం.
అయితే ప్రెగ్నెన్సీ టైంలో నెయ్యి తినడం వల్ల సహజ ప్రసవం అవుతుందని కొందరు నమ్ముతారు.ఈ క్రమంలోనే గర్భంతో ఉన్నప్పుడు నెయ్యిని అధిక మొత్తంలో తీసుకుంటారు.అసలు ఇందులో ఎంతవరకు నిజం అంటే.ఏ మాత్రం నిజం లేదు అనే అంటున్నారు నిపుణులు.
ఇది కేవలం అపోహ మాత్రమే.వాస్తవానికి ప్రసవం పూర్తిగా శిశువు పరిమాణం, మీ కటి పరిమాణం మరియు గర్భధారణ సమయంలో మీ శారీరక శ్రమ పై ఆధారపడి ఉంటుంది.
అంతే తప్ప నెయ్యి తింటే సహజ ప్రసవం అవుతుంది అన్న దాంట్లో నిజం లేదు.పైగా ప్రెగ్నెన్సీ టైం లో నెయ్యి ని అధికంగా తీసుకుంటే అది మీ బరువుతో పాటు మీ బిడ్డ బరువును కూడా పెంచుతుంది.దీని కారణంగా ప్రసవం సమయంలో పలు సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.అలా అని నెయ్యిని పూర్తిగా ఎవైడ్ కూడా చేయకూడదు.
రోజుకు ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుంటే తల్లికి బిడ్డకు ఎంతో మంచిది.ప్రెగ్నెన్సీ టైంలో మహిళలు నెయ్యిని రోజు మితంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా పని చేస్తుంది.రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.అలాగే నెయ్యిలో ఉండే పలు పోషకాలు కడుపులోని బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్ కు సహాయపడతాయి.మరియు ప్రెగ్నెన్సీ టైంలో నెయ్యిని పరిమితంగా తీసుకుంటే ఎముకలు దృఢంగా సైతం మారతాయి.