గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఫుల్ డ్రస్ రిహార్సల్ జరగనున్నాయి.ఈ వేడుకల్లో ఏపీ శకటం సందడి చేయనుంది.
రాష్ట్రంలోని కోనసీమ ప్రబలతీర్థం గణతంత్ర వేడుకలకు ఎంపిక అయింది.ఈనెల 26న జరిగే పరేడ్ కు సన్నద్ధతకు రిహార్సల్ గా నిర్వహిస్తున్నారు.
విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు సాగనున్న ఈ ఫుల్ డ్రస్ రిహార్సల్ లో ఎటువంటి పొరపాట్లు చోటుచేసుకుండా చర్యలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో అర్ధరాత్రి నుంచి ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.
ఇందులో భాగంగా త్రివిధ దళాల సైనిక కవాతులు, కేంద్ర రాష్ట్ర శకటాల ప్రదర్శనలతో పాటు వైమానిక విన్యాసాలు జరగనున్నాయి.మొత్తంగా 17 రాష్ట్రాలు, ఆరు కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ఏర్పాటు కానుంది.
అదేవిధంగా ఈ వేడుకలలో సీఆర్ఫీఎఫ్ కు చెందిన నారీశక్తి శకటం, నార్కోటిక్స్ శకటానికి చోటు దక్కింది.దక్షిణ భారతదేశం నుంచి ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఈ అవకాశం దక్కగా.
తెలంగాణ శకటం ఏమి ఎంపిక కాలేదు.







