ప్రపంచ వ్యాప్తం గా ఉన్న దేశాలకు మన దేశ ప్రజలు ఎంతో మంది వెళ్లి వలస వెళ్లి జీవిస్తున్నారు.అలా వలస వెళ్లిన వారిలో కొంత మంది ప్రజలు అత్యున్నత పదవులలో కొనసాగుతున్నారు.
అలా అత్యున్నత పదవులలో కొనసాగుతూ మన దేశానికి గొప్ప పేరును తీసుకొస్తున్నారు.కానీ కొంత మంది దోపిడీలు, హత్యలు చేసి వేరే దేశాలలో దోషులుగా మిగులుతున్నారు.
తాజాగా ఇంగ్లాండ్ లో రెండు సంవత్సరాల నాటి హత్య కేసు లో ఒక భారత సంతతి వ్యక్తి దోషిగా నిర్ధారించబడ్డాడు.ఈ మేరకు స్థానిక కోర్ట్ తీర్పు ఇచ్చింది.

2021 జనవరిలో డడ్లీ సమీప ప్రాంతంలో మహమ్మద్ హరూన్ జెబ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.గుర్తు తెలియని వ్యక్తులు అతడిని తలపై కాల్చి కారులో పారిపోయారు.రెండు కుటుంబాల మధ్య గొడవలు కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా భారత సంతతికి చెందిన గుర్‌దీప్ సంధూ తో పాటు హసన్ తస్లీమ్ ను అనుమానించి అదుపులో తీసుకున్నారు.

ఇటువంటి ఇటీవల ఇద్దరినీ దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది వేస్ట్ మెడ్ ల్యాండ్స్ పోలీస్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ముందుగా రెడీ చేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు ఇద్దరు పిల్లలు తమ తండ్రిని కోల్పోయారు ఈ బాధ ఎప్పటికీ తొలిగిపోదు అని పోలీసు ఉన్నది ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు.







