ఏపీలో రేపటి నుంచి రెండు రోజులపాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.నరసాపురం నియోజకవర్గంపై కమలదళం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
కాగా భీమవరం వేదికగా జరిగే ఈ సమావేశాలకు పార్టీ శ్రేణులు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు.ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాల్లో వ్యూహా రచన చేయనున్నారని సమాచారం.
ప్రజలకు మరింత చేరువ కావాలనే యోచనలో ఉన్నారు ఏపీ కమలనాథులు.ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ స్థానిక నేతలతో బీజేపీ నేతలు భేటీకానున్నారు.ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమైంది.







