నాకు బాలకృష్ణనే శివుడు... వైరల్ అవుతున్న తమన్ కామెంట్స్!

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వీర సింహారెడ్డి.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

 Balakrishna Is Shiva For Me Tamans Comments Are Going Viral , Balakrishna ,shiva-TeluguStop.com

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో చిత్ర బృందం విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Telugu Akhanda, Balakrishna, Shiva, Taman, Tollywood-Movie

బాలకృష్ణ నటించిన ఆఖండ వీరసింహారెడ్డి సినిమాలకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.ఈరెండు సినిమాల్లో కూడా అద్భుతమైన హిట్ అందుకోవడంతో బాలయ్య పై తమన్ పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపించారు.ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా గోవిందా గోవిందా అనే మాట తర్వాత వినిపించేది జై బాలయ్య అనే మాటే కదా అంటూ గతంలో బాలయ్యను గోవిందుడితో పోల్చిన తమన్ తాజాగా వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణని ఏకంగా శివుడితో పోల్చారు.

Telugu Akhanda, Balakrishna, Shiva, Taman, Tollywood-Movie

బాలకృష్ణను నేను శివుడిలా చూస్తున్నాను అఖండ సినిమా చేసే సమయం నుంచి నాకు బాలకృష్ణనే శివుడు అంటూ తమన్ కామెంట్ చేశారు.నేను అఖండ ఆర్ఆర్(నేపథ్య సంగీతం) చేస్తున్న సమయంలో స్క్రీన్ పైన నిజంగానే శివుడిని చూస్తున్నాననే భావన కలిగేది.శివుడికి ఎలాగైతే చేశామో అలాగే చేసేవాళ్ళం.నేను నాన్ వెజ్ తినను కేవలం ఆమ్లెట్ మాత్రమే తింటాను అయితే ఆఖండ సినిమాకు ఆర్ ఆర్ చేస్తున్న సమయంలో ఆమ్లెట్ కూడా తినకుండా పనిచేశాను.

ప్రతిరోజు లింగ పూజ చేసుకొని పని ప్రారంభించే వాడిని అంటూ తమన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube