ఈ పరిస్థితులలో కూడా అలాంటి పని చేయబోతున్న సమంత.. సక్సెస్ అవుతుందా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

 Samantha Varun Dhawan Citadel Web Series Shooting Begins,samantha, Varun Dhawan,-TeluguStop.com

ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోలుకొని సినిమాలో షూటింగ్లో మళ్లీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.అయితే మహేష్ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ సమంత సినిమాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

మయోసైటీస్ వ్యాధితో బాధపడుతూనే హాస్పిటల్ బెడ్ పైనుంచి యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే.అలాగే ఇటీవల శాంకుతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.

Telugu Bollywood, Citadel Web, Khushi, Myositis, Samantha, Shakunthalam, Tollywo

ఆరోగ్యం సహకరించక పోయినప్పటికీ తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలన్న తపనతో సమంత ధైర్యంగా తన వ్యాధిని ఎదుర్కొని బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.ఇకపోతే గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.ఇది ఇలా తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొంటుంది సమంత.అయితే అందుకు సంబంధించిన ఫొటోస్ ని మేకర్స్ అఫీషియల్ గా విడుదల చేశారు.

అయితే బాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లల్లో ఈ వెబ్ సిరీస్ కూడా ఒకటి.ఇందులో సమంత కీలకపాత్రలో నటించనుంది.అలాగే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా కీలకపాత్రలో కనిపించనున్నాడు.

Telugu Bollywood, Citadel Web, Khushi, Myositis, Samantha, Shakunthalam, Tollywo

అయితే వరుణ్ ధావన్ సమంతా కలిసి నటించబోతున్న ఈ వెబ్ సిరీస్ సమంతకు కచ్చితంగా మంచి పేరుతో చీపెడుతుంది అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కాగా ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత ఆ బాధను పక్కన పెట్టి తాను ఇచ్చిన కమిట్మెంట్స్ కి ఏ మాత్రం తగ్గని సమంత ఇలా మళ్లీ షూటింగ్లో పాల్గొనడం సమంత ఫ్యాన్స్ కు కొత్త ఊపునిస్తోంది.దీంతో అభిమానులు సమంతకు వర్క్ పై ఉన్న డెడికేషన్ ని మెచ్చుకుంటున్నారు.

ఇటువంటి పరిస్థితులలో కూడా ధైర్యం చేసి ఆ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంతకు ఆ వెబ్ సిరీస్ మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందా అలాగే సక్సెస్ అవుతుందా లేదా చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube