వాణిజ్య ప్రకటన చూసిన, యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ చూసిన, పేరు మోసిన వెబ్సైట్స్ హెడ్డింగులైన, తలకు మాసిన పెద్ద చానల్స్ అయినా ఆడదాని అందాలు వర్ణించకుండా, సొగసులను అమ్మడి సరుకుగా మార్చకుండా డబ్బులు సంపాదించలేరు.ఆ చీరలో జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య అందాల ఆరబోత, షో తో రెచ్చిపోయిన శ్రీముఖి, ఏదో అందాలతో పిచ్చెక్కిస్తున్న అనసూయ అంటూ తమ కంపు కొట్టే వార్తలు మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు.
ఇక సినిమా హీరోయిన్ల విషయం చెప్పాల్సిన అవసరం లేదు ఆ వర్ణన, అందాల ఆరబోత కు అడ్డు అదుపు ఉండనే ఉండదు.మొదటి నుంచి ఇంతే.
వెబ్ సైట్స్ కి నాభి అందాలు ప్రత్యేకం.వాణిజ్య ప్రకటనలకు తొడల నుంచి మొహం దాకా అంతా అవసరమే.అబ్బో ఆడదాని అందానికి, ఒంపు, సొంపుకు, ప్రతి అంగాన్ని వర్ణిస్తూ దేహానికి దాసోహం అంటూ అంగడి సరుకుగా మార్చేస్తున్నారు.అప్పుడే మొదలెట్టినా యూట్యూబ్ లు, చిన్నాచితక సైట్లకు ఇదే ప్రధాన ఆదాయం.
వీటికి తగ్గట్టుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా సొల్లు కార్చుకోవడం అటు ఉంచితే, ప్రతి హీరోయిన్ నుంచి యాంకర్ల వరకు చిట్టి పొట్టి బట్టలు వేసుకుని ఫిట్టు కనిపించేలా అవుట్ ఫిట్ వేసుకోవడం షరా మామూలే.
కేవలం అందం అంటే ఆడవారేనా ? ఆ ముక్కు, ఆ మొహం, నాభి, తొడలు, ఒడ్డు పొడుగు వర్ణించాల్సిందేనా ?మీడియాలో ఇంత వర్ణించగల అందాలను జబర్దస్త్ లాంటి షోలకి వెళ్లేసరికి బాడీ షేమింగ్ తో చంపేస్తారు.ఓసారి వర్ష ఆ బాడీ షేమింగ్ తట్టుకోలేక షో నుంచి వెళ్లిపోయిన విషయం కూడా మనకు తెలిసిందే.అదే వర్ష తెల్లచీర కట్టుకుని ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే తెల్లచీరలో అందాలు ఆరబోస్తున్న వర్ష నీ చూస్తే తట్టుకోలేరు అంటూ
నాలుగు ఐదు చానల్ లలో థంబ్ నెయిల్స్ పుట్టించి పండగ చేసుకుంటాయి.ఇక ఆఖరికి ఆడ గెటప్పులు వేస్తున్న శాంతి స్వరూప్ ని కూడా వదలరు.ఇన్ని వేల మంది ఉన్న ఫీల్డ్ లో అమ్మాయిల పక్కన పెడితే కాస్త అబ్బాయిలను కూడా చూడండి అంటే అబ్బాయిల మొహం ఎవరు చూస్తారండి అంటూ మళ్ళీ వీళ్ళే చెప్తారు.
అంతా కలికాలం.