స్టార్ హీరో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాకు రిలీజ్ రోజున నెగిటివ్ టాక్ వచ్చినా ఆ టాక్ ను అధిగమించి ఈ సినిమా అంచనాలకు మించిన హిట్ గా నిలిచింది.వీరసింహారెడ్డి, జైసింహారెడ్డి పాత్రలలో బాలయ్య నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఒకే సినిమాలో నటిస్తే బాగుంటుందని అభిమానుల కోరిక అనే సంగతి తెలిసిందే.
జనతా గ్యారేజ్ మూవీ రిలీజైన సమయంలో మోహన్ లాల్ పోషించిన పాత్రలో బాలయ్య కనిపించి ఉంటే బాగుండేదని సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది.
ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమా గురించి కూడా అదే తరహా చర్చ జరుగుతోంది.జైసింహారెడ్డి పాత్రలో తారక్ కనిపించి ఉంటే బాగుండేదని తారక్ ఈ సినిమాలో నటించి ఉంటే ఆ పాత్రను మరింత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దే అవకాశం అయితే ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సినిమాలో ఎలాంటి రోల్ లో నటించినా తారక్ తన నటనతో ముద్ర వేయగలరు.బాలయ్య అంగీకరిస్తే బాలయ్య తారక్ కాంబోలో సినిమా రావడానికి ఎంతో సమయం పట్టదని నందమూరి కుటుంబానికి సన్నిహితులైన వారు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.మరోవైపు వీరసింహారెడ్డి మూవీ అన్ని ఏరియాలలో మంచి లాభాలను అందిస్తూ నందమూరి ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది.

సంక్రాంతి పండుగకు రిలీజ్ కావడం ఈ సినిమాకు కలిసొచ్చిందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి.వీరసింహారెడ్డి మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యి బాలయ్య ఖాతాలో మరో క్లీన్ హిట్ గా నిలిచింది.అన్ స్టాపబుల్ షో నుంచి బాలయ్య ఇమేజ్ పెరిగిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా సినిమాకు బాలయ్య తన రేంజ్ ను, రెమ్యునరేషన్ ను పెంచుకుంటున్నారు.







