ఒకప్పటి ఫన్నీ క్లిప్ షేర్ చేసుకున్న శివాత్మిక రాజశేఖర్.. వైరల్ వీడియో?

సోషల్ మీడియా అందుబాటులో ఉండటం వల్ల ఒకప్పుడు రికార్డు చేసిన సంఘటనలు కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం తమకు సంబంధించిన గత వీడియోలను పంచుకుంటూ బాగా సందడి చేస్తున్నారు.

 Shivatmika Rajasekhar Shared A Funny Clip Of Yesteryear Viral Video Details, Shi-TeluguStop.com

ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు తమ చిన్ననాటి ఫోటోలు, వీడియోలు పంచుకొని సోషల్ మీడియా ప్రియులను ఆశ్చర్యపరిచారు.తాజాగా శివాత్మిక కూడా ఒకప్పటి ఫన్నీ వీడియో షేర్ చేసుకోగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

ఇక ఆ వీడియోలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో డాక్టర్ రాజశేఖర్.

ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటుడు.  రాజశేఖర్ తెలుగు, తమిళ సినిమాలలో నటించి స్టార్ హోదాకు చేరుకున్నాడు.

తన నటనతో మాత్రం మంచి గుర్తింపు పొందాడు.ఈయన 1991లో మరో నటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఇక వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా ఇద్దరిని సిని ఇండస్ట్రీ కూడా పరిచయం చేశాడు.ఇద్దరి కూతుర్లను తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీకే పరిచయం చేశాడు.

Telugu Clip, Rajasekhar, Shivatmika-Movie

ఇక చిన్న కూతురు శివాత్మిక  2019లో విడుదలైన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.వీరిద్దరికి మంచి సక్సెస్ అందింది.ఆ తర్వాత శివాత్మిక కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ తన మొదటి సినిమా ఇచ్చినంత సక్సెస్ ఆ సినిమాలు ఇవ్వలేకపోయాయి.

అయినా కూడా ఈమెకు అవకాశాలు ఏ మాత్రం తగ్గట్లేవు అని చెప్పాలి.ఇక శివాత్మిక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.ఇక ఈ ముద్దుగుమ్మ మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది.

ఈమె తోటి హీరోయిన్లు గ్లామర్ షోలు పరిచయం చేయటంతో ఈ ముద్దుగుమ్మ కూడా గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం తగ్గట్లేదు.

Telugu Clip, Rajasekhar, Shivatmika-Movie

అప్పుడప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలను బయటపడుతూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.ఇక ఈ బ్యూటీ కి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.శివాత్మిక కొన్ని కొన్ని సార్లు  మేకప్ లేకుండా కూడా కనిపిస్తూ షాక్ ఇస్తూ ఉంటుంది.

కొన్ని సార్లు ఈమె చేసే అతికి నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తుంటారు.అయినా వాటిని పట్టించుకోదు.ఇక ఇదంతా పక్కన పెడితే.తన తండ్రి నటించే సినిమాల షూటింగ్ సమయంలో శివాత్మిక, శివాని కచ్చితంగా పాల్గొంటారు.

చిన్నప్పటి నుంచి రాజశేఖర్ తన ఇద్దరు కూతుర్లను తన వెంబడి షూటింగులకు తీసుకెళ్లేవాడు.అయితే శివాత్మిక గతంలో తన తండ్రితో సరదాగా ఆడుకుంటున్న ఒక వీడియోను పంచుకుంది.

ఆ వీడియోలో తన తండ్రి సీరియస్ గా ఒక వైపు చూస్తూ ఉండగా మధ్యలో తను వచ్చి చెయ్యితో తన తండ్రిని సైగలు చేస్తున్నట్లు కనిపించింది.తన తండ్రి ఎంతకు చూడకపోయేసరికి అదే పనిగా తను అలా చెయ్యి ఊపుతూ కనిపించింది.

ఇక ఆ వీడియో తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్స్ ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube