రాప్తాడు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.గత ఎన్నికల్లో 175 స్థానాలలో 23 సీట్లు మాత్రమే ప్రజలు ఇచ్చారంటే…టీడీపీనీ.
చెత్తబుట్టలో పడేశారని అర్థం.మరి చెత్త పార్టీలో ఉన్న చెత్త నాయకులు వారి చెత్త సర్వేలు.
చేసి కార్యకర్తలను మోసం చేస్తున్నారు.మళ్లీ గెలుస్తాము అధికారంలోకి వస్తామని.
కల్లబొల్లి కబుర్లు చెప్పుకొస్తున్నారు.తెలుగుదేశం పార్టీలో 420 నాయకులు ఉన్నారు.
వాళ్లు ఫేక్ సర్వేలు చేయించి క్యాడర్ ని మోసం చేస్తున్నారు.అవే ఫేక్ సర్వేలతో వైసీపీ ప్రజా ప్రతినిధులపై ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ప్రయోగిస్తుంది.అధికారంలోకి వచ్చాక అది పీకుతాం., ఇది చేస్తామని ఏయో మాటలు చెబుతున్నారు.
మరి అధికారంలో ఉన్న మేము ఇంకెంత చేయగలమని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు పై మండిపడ్డారు.అక్రమంగా కడితే అది కరకట్ట మీద ఉన్న చంద్రబాబు భవనమైన ఏదైనా సరే కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు.అక్రమంగా కట్టడాలు కూల్చే విషయంలో ఏ ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రి ఉండవసరం లేదు.
ప్రభుత్వానికి అధికారం ఉంటుందని చెప్పుకొచ్చారు.ఈమధ్య తెలుగుదేశం పార్టీ నాయకుల భాష వింటుంటే రామారావు గారి గౌరవాన్ని అగౌరవరుస్తున్నారని అన్నారు.ఐదు సంవత్సరాలు ప్రజల అధికారం ఇస్తే ప్రజలను వంచించి అక్రమ సంపాదన సంపాదించుకున్నారని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.175 కి 150 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి ఉనికి లేదు.

సంబంధిత నియోజకవర్గాలలో కనీసం నాయకులు కూడా లేరు.ప్రతిపక్ష పాత్ర కూడా సరైన రీతిలో పోషించటం లేదు.చరిత్రలో దేశంలో ఏ రాజకీయ నేత చేయనిరీదుల ప్రజలకు అభివృద్ధి చేశారు జగన్.ప్రజలు ఆయన వైపు ఉంటారా.? లేకపోతే మీ వైపు ఉంటారా అని.తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఖబడ్దర్ అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు.







