టాలీవుడ్ లో ఆ నాలుగు సినిమాలను ఫాలో అవుతున్న బడా నిర్మాతలు.. సక్సెస్ అవుతారా?

తాజాగా తెలుగులో విడుదల అయిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, ధమాకా, కార్తికేయ2 లాంటి సినిమాలు చూసిన తర్వాత టాలీవుడ్ నిర్మాతల ఆలోచన తీరు మారిపోయింది.ఈ నాలుగు సినిమాలు విడుదలకు ముందు సరైన టాక్ కూడా లేదు అన్నది వాస్తవం.

 Big Producers Are Following Those Four Movies In Tollywood ,walteru Veerayya, Ve-TeluguStop.com

ఈ సినిమాలు విడుదలకు ముందు కేవలం కాంబినేషన్ సినిమాలే తప్ప విషయం ఉన్న సినిమాలు కావు అన్న ఫీలింగ్ ఇండస్ట్రీలో ఉంది.ఇక విడుదల తర్వాత ఈ సినిమాలకు సరైన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా లేదు.

అంతేకాకుండా పూర్తిస్థాయిలో 100% పాజిటివ్ రివ్యూలు కూడా లేవు.కానీ ఈ సినిమాలను జనం ఆదరించడంతోపాటుగా, 100 కోట్ల క్లబ్ లోకి ఈ నాలుగు సినిమాలను తోసేశారు.

Telugu Dhamaka, Karthikeya, Mythri Company-Movie

ఇక మైత్రి మూవీస్ సంస్థ వారు కేవలం కాంబినేషన్ లను నమ్మి దర్శకులకు సినిమాలను వదిలేసి తెరకెక్కించేశారు.మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మాత్రమే కాకుండా పీపుల్స్ మీడియా సంస్థ అంతే.బరిలోకి దిగిన తర్వాత వెనక్కి తగ్గకుండా ఖర్చు చేశారు.అలా పీపుల్స్ మీడియా సంస్థ వారు కూడా దర్శకులునే నమ్మారు.

Telugu Dhamaka, Karthikeya, Mythri Company-Movie

నమ్మినందుకుగాను రెండు సంస్థలకు కూడా మంచి ఫలితాలు వచ్చాయి.అయితే మైత్రి మూవీ మేకర్ సంస్థ వారు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.కానీ ఒకవేళ విడివిడిగా సినిమాలు విడుదల అయి ఉంటే చిరంజీవి బాలయ్య సినిమాల పరిస్థితి ఏమై ఉండేది అన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి.ఒకవేళ సంక్రాంతి పండగకు కాకపోయి ఉంటే బాలయ్య బాబు సినిమా రేంజ్ ఏంటి అని లెక్కలు వేస్తున్నారు.

Telugu Dhamaka, Karthikeya, Mythri Company-Movie

ఆ విధంగానే ధమాకా సినిమా గురించి కార్తికేయ 2 సినిమాలో రీజన్ ల గురించి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చలు కొనసాగుతున్నాయి.అయితే కారణాలు ఏవైనప్పటికీ ఈ నాలుగు సినిమాల నిర్మాతలు రిస్క్ చేశారని చెప్పవచ్చు.ఆ రిస్క్ కారణంగానే ఆ సినిమాలు వారికి కోట్లు తెచ్చిపెట్టాయి.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఇదే ఆలోచిస్తున్నారు.అవి హిట్ అవ్వడాన్ని ఆదర్శంగా తీసుకొని అదే దారిలో వెళ్లాలా?లేదంటే అదే సరైన దారి అనుకోవాలా?అన్న ఆలోచనలో ఉన్నారు.ఈ విషయంలో ఆలోచించి అర్థం కాక తల గోక్కుంటున్నారు బడా నిర్మాతలు.

అదృష్టం కలిసి వస్తే బాగుంటుంది కానీ అదృష్టం కలిసి రాకపోతే ఫలితాలు ఎలా ఉంటాయి అన్నదానిపై టెన్షన్ పడుతున్నారు.అదృష్టం అందరికీ అన్నిసార్లు కలిసి రాదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అన్న డైలమాలో ఉన్నారు బడా నిర్మాతలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube