దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వారసుడు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన దక్కించుకుంది.
ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రావడంతో కొందరు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా గురించి రివ్యూ ఇస్తూ ఈ సినిమా రొటీన్ గా ఉందని కామెంట్స్ చేశారు.మరికొందరైతే ఒక నాలుగు ఐదు సినిమాలను కలిపితే వారసుడు సినిమా అవుతుందని ఈ సినిమా గురించి మీమ్స్ కూడా క్రియేట్ చేశారు.
ఇలా ఈ సినిమాపై పలు ట్రోల్స్ రావడంతో వంశీ పైడిపల్లి ఈ ట్రోల్స్ పై స్పందించారు.ఈ క్రమంలోనే ఒక తమిళ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ సినిమా గురించి వస్తున్నటువంటి ట్రోల్లింగ్ గురించి స్పందిస్తూ ఒక సినిమాని ట్రోల్ చేయడం చాలా సులభం కానీ ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే ఎంతో కష్టంతో కూడుకొని ఉంటుంది.
ఒక సినిమా చేయడం కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని వంశీ తెలియజేశారు.

ఇక విజయ్ లాంటి పెద్ద స్టార్స్ సినిమాల కోసం ఎంతో కష్టపడతారని ఇలాంటి వారి సినిమాలలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని చాలా క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలని సినిమా చేయడం అంటే జోక్ కాదు అంటూ ఈయన మాట్లాడారు.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది నేటిజన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ… సినిమా అన్న తర్వాత మంచి రివ్యూలు ఉంటాయి చెడ్డ రివ్యూలు ఉంటాయి.

ఒక సినిమా బాగుందని ఎలా అయితే ప్రశంసలు కురిపిస్తారో బాగలేకపోతే అలాగే విమర్శలు కూడా చేస్తారు అంటూ కామెంట్లు చేయగా మరి కొంతమంది నేటిజన్స్ కష్టపడి పోతున్నాము అని ఓ తెగ మాట్లాడేస్తున్నారు మీరు ఏమైనా సమాజ సేవ చేస్తున్నారా కష్టపడటానికి… చేస్తున్నది బిజినెస్ ఏ కదా ఇందులో కష్టం ఏముంటుంది కామ్ గా ఉండు అంటూ నేటిజన్స్ తమదైన శైలిలో వంశీ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.







