డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.కర్ణాటక యాద్గిర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం మోదీ మాట్లాడుతూ దేశ అభివృద్ధే తమకు ముఖ్యమని చెప్పారు.వచ్చే 25 ఏళ్లలో దేశానికి అమృత కాలామన్న ఆయన ఈ సమయంలోనే దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్ గా నిర్మించుకోవాలని తెలిపారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేపట్పటికీ దేశంలో కేవలం 3 కోట్ల ఇళ్లకు మాత్రమే కుళాయి ద్వారా నీళ్లు వచ్చేవన్నారు.ఇప్పుడు 11 కోట్ల ఇళ్లకు అందుతున్నాయని పేర్కొన్నారు.
బీజేపీకి ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యం కాదని స్పష్టం చేశారు.