సుఖేష్ చంద్రశేఖర్.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు అయిన సుకేష్ చంద్రశేఖర్ కేసు బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీలలో మారుమోగిపోయిన విషయం తెలిసిందే.కొద్దిరోజుల పాటు సుకేష్ చంద్రశేఖర్ మారుమోగిపోయింది.కేసులో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.సుఖేష్ చంద్రశేఖర్ కేసులో అతనితోపాటు ఎక్కువగా వినిపించిన పేరు జాక్వెలిన్ పెర్నాండేజ్.సినిమాల ద్వారా కంటే పెర్నాండేజ్ ఈ కేసు విషయంలోనే బాగా హైలెట్ అయింది అని చెప్పవచ్చు.
దీంతో ఈమె పేరు కూడా కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో మారు మోగిపోయింది.
కాగా పెర్నాండేజ్ బాలీవుడ్లో పలు సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.
సుఖేష్ చంద్రశేఖర్ ను అరెస్టు చేసిన తర్వాత ఈడీ అధికారులు అతనితో సంబంధం ఉంది అన్న ఆరోపణలతో పెర్నాండేజ్ ను కూడా విచారించిన విషయం తెలిసిందే.తాజాగా వాంగ్మూలం సమర్పించడం కోసం వచ్చిన ఆమె సుఖేష్ చంద్రశేఖర్ గురించి సంచలన విషయాలను వెల్లడించింది.
అతని వల్ల తన లైఫ్ నాశనం అయ్యింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.తన ఎమోషన్స్ తో అతను ఆడుకున్నాడని తన కెరీర్ ను నాశనం చేశాడని పాటియాలా కోర్టుకు సమర్పించిన అఫీడవిట్ లో పేర్కొంది.
సుఖేష్ తాను సన్ టీవీ ఓనర్ నని, తమిళనాడు మాజీ సీఎం జయలలిత బంధువని, నాకు పెద్ద ఫ్యాన్ అని నాతో సౌత్ లో సినిమా చేస్తానని అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించాడు అని తెలిపింది పెర్నాండేజ్.రోజులో నాతో ఎక్కువసార్లు వీడియో కాల్స్ మాట్లాడేవాడు.అలాగే రోజు ఉదయం షూటింగ్ కు వెళ్లే ముందు షూటింగ్ లో ఉన్నప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత ఫోన్లు చేసేవాడు.జైల్లో ఉన్నాడని అక్కడి నుంచే ఫోన్ చేస్తున్నానని నాకు చెప్పలేదు.
అలా అతను నాకు చివరిసారిగా 2021 ఆగస్టు 8న కాల్ చేశాడు ఆ తర్వాత అతడు అరెస్ట్ అయినట్టు తెలిసింది అని ఆమె ఆరోపించింది.