స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.కమిషన్ ఏర్పాటులో జాప్యం జరుగుతుందని న్యాయవాది ఉమేశ్ చంద్ర కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో రెండు వారాల్లో కమిషన్ ఏర్పాటు పూర్తి అవుతుందని ప్రభుత్వం తెలిపింది.అనంతరం డైరెక్షన్ ఇవ్వాలని ఉమేశ్ చంద్ర కోర్టును అభ్యర్థించారు.
గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నప్పుడు డైరెక్షన్ ఇవ్వడం సరికాదని ధర్మాసనం పేర్కొంది.ఈ నేపథ్యంలో నెల రోజుల్లో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.
అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేసింది.







