తమిళనాడులోని తిరపత్తూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.నిన్న జల్లికట్టులో గాయపడిన యువకుడు మృతిచెందాడు.
అయితే యువకుడి మృతికి పోలీసులే కారణమని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలోనే పోలీసులపై తిరుపత్తూరు గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి.మరోవైపు తిరుపత్తూరు జల్లికట్టును రద్దు చేసిన పోలీసులు నాట్రపల్లిలో భారీగా మోహరించారు.







