అల్లు అర్జున్.సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప సినిమా 2021 సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
భారీ వసూళ్లను సొంతం చేసుకున్న పుష్ప సినిమా కు సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప 2 సినిమా ను ముందుగా అనుకున్న ప్రకారం 2022 సంవత్సరం డిసెంబర్ లో విడుదల చేయాల్సి ఉంది.కానీ స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులు చేయడం వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది.
విడుదల చేయాలి అనుకున్న సమయానికి షూటింగ్ ను మొదలు పెట్టారు.పుష్ప 2 సినిమా చిత్రీకరణ చాపకింద నీరు మాదిరిగా మెల్లగా సాగుతోంది.
మారేడు మిల్లి ప్రాంతంతో పాటు పలు ప్రాంతాల్లో పుష్ప 2 సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.పుష్ప 2 సినిమా 2023 సంవత్సరంలో వస్తుందా లేదంటే 2024 సంవత్సం వరకు వేచి చూడాల్సిందే అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ వారు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ద్వి తీయార్థం లోనే ముగించబోతున్నారట.ఇక విడుదల తేదీ విషయంలో ఉగాది సందర్భంగా విడుదల కాబోతున్న పుష్ప 2 సినిమా యొక్క ఫస్ట్ లుక్ తో క్లారిటీ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట.పుష్ప 2 లో బన్నీ మరింత పవర్ ఫుల్ గా మాస్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.రష్మిక మందన్నా శ్రీవల్లి గా తన పాత్రలో కంటిన్యూ అవ్వబోతుంది.
సునీల్ మరియు అనసూయ పాత్రల గురించి క్లారిటీ లేదు.ఇక ఫాహద్ ఫాసిల్ యొక్క పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది అనేది మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప 2 సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.బాలీవుడ్ హాట్ బ్యూటీ ఐటం సాంగ్ ను చేయబోతుందట.
బాలీవుడ్ స్టార్ నటుడు ఒకరు ఈ సినిమా యొక్క విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.







