వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడం మానేసి ఎంతో కాలమైంది.అందుకు బదులుగా నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాటలు యుద్ధానికి దిగుతున్నారు.
ఒకరి తర్వాత ఒకరు వచ్చి అదే పనిగా పవన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఈ మధ్యనే శ్రీకాకుళంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు.
ఎక్కడా పరుష పదజాలం వాడకుండా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టారు.అలాగే వైసిపి మంత్రి రోజాపై, మిగిలిన మంత్రులపై కూడా పవన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.ఇందుకు బదులుగా ఇప్పుడు వైసీపీ నుండి నూతన యూత్ వింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పవన్ పై ఎదురుగాడికి దిగాడు.

“అసలు పవన్ కళ్యాణ్ కు 175 స్థానాల పేర్లు అయినా తెలుసా?” అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే తనకు రంగం సినిమాలో ప్రకాష్ రాజ్ గుర్తుకు వస్తున్నాడని ఎద్దేవా వేశారు.పైకి మంచి వాడిలా కనిపిస్తున్నా లోపల మాత్రం అతనిలో చాలా చెడు ఉందని… అతను విలన్ అని బైరెడ్డి వ్యాఖ్యానించడం విశేషం.
అంతేకాకుండా దేశంలో అత్యంత అవినీతిపరుడైన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కు ఏముందని బైరెడ్డి వ్యాఖ్యానించాడు.ఇదంతా పక్కన పెడితే జగన్ కు ఒక ప్రైవేట్ సైన్యం ఉందని, అతని జోలికి వస్తే వారంతా ఊరుకోరు అని బెదిరించినట్లు సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

ఇక ఈ విషయంపై జనసైనికులు తీవ్రంగా స్పందించారు.జగన్ కి అధికారం వల్ల ప్రైవేట్ సైన్యం ఉంటే పవన్ కళ్యాణ్ కు జన సైనికులం అందరం ఉన్నామని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.ఇక దేశంలోనే అత్యంత అవినీతిపరుడు అనే వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.జగన్ పై ఉన్న కేసులు చంద్రబాబు తన జీవితంలో సగం కూడా ఎదుర్కొని ఉండడు.
ఇక 175 స్థానాల పేర్లు పవన్ కళ్యాణ్ కు కాదు కదా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికైనా గుర్తు ఉంటాయో లేదో అన్నది కూడా అనుమానమే.కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎలివేషన్ల కోసం నోటికి వచ్చింది మాట్లాడటం మానేసి కరెక్ట్ పాయింట్ మాట్లాడితే మంచిది అంటున్నారు జనసేన మద్దతుదారులు.







