హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది.ఈ వన్డేలో భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ వీరవిహారం చేశారు.భారీ స్కోర్ చేసిన భారత్… న్యూజిలాండ్ ముందు 350 పరుగుల టార్గెట్ ఉంచింది.50 ఓవర్లలో భారత్ స్కోర్ 349/8 గా నమోదైంది.
కివీస్ పై శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించారు.145 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశారు.హ్యాట్రిక్ సిక్స్ లతో డబుల్ సెంచరీ పూర్తి చేశారు.కాగా వన్డే కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ సాధించారు.దీంతో వన్డేలలో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత బ్యాటర్ గా గిల్ నిలిచారు.ఓ వైపు వికెట్లు పడుతున్నా శుభ్ మన్ గిల్ ధాటిగా ఆడారని చెప్పొచ్చు.
ఈ క్రమంలో గిల్ దూకుడుతో ఉప్పల్ వన్డేలో భారత్ భారీ స్కోర్ సాధించింది.







