ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ అందించింది.స్మార్ట్‌వాచ్ కొంటే ఫ్రీగా ఇయర్ ఫోన్స్ ఇస్తామని ప్రకటించింది.
అమెజాన్‌లో బోట్ ఫ్లాష్ ఎడిషన్ స్మార్ట్ వాచ్ కొనడం ద్వారా కొనుగోలుదారులు ఫ్రీగా ఇయర్ ఫోన్స్ గెలుచుకోవచ్చు.కాంబో డీల్‌లో భాగంగా ఇయర్ ఫోన్స్‌ను ఉచితంగా అమెజాన్ అందిస్తోంది.

బోట్ ఫ్లాష్ ఎడిషన్ స్మార్ట్ వాచ్, బాష్‌హెడ్స్ 100 ఇన్ ఇయర్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ సొంతం చేసుకోవడానికి కొనుగోలుదారులు రూ.8,000 వెచ్చించాల్సి ఉంటుంది.అయితే సేల్‌లో భాగంగా ఆ రెండింటినీ రూ.1,797కే దక్కించుకోవచ్చు.ఇలా చూసుకుంటే 77 శాతం వరకు డిస్కౌంట్ ధరతో మీరు వీటిని కొనచ్చని చెప్పవచ్చు.స్మార్ట్‌వాచ్ కొనాలని అనుకునేవారు ఈ ఆఫర్ కంపల్సరీగా ఒకసారి చెక్ చేయవచ్చు.బోట్ ఫ్లాష్ ఎడిషన్ స్మార్ట్ వాచ్‌లో 1.3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 10 యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్స్, రన్నింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ వంటి యాక్టివిటీ ట్రాకింగ్, వన్ వీక్ బ్యాటరీ బ్యాకప్, నోటిఫికేషన్స్, కాల్స్, టెక్స్ట్, సోషల్ మీడియా అలర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి.

ఇక బాష్‌హెడ్స్ 100 ఇయర్ ఫోన్స్ 10 ఎంఎం డైనమిక్ డైవర్స్‌తో వస్తాయి.ఇవి మంచి సౌండ్ క్వాలిటీ డెలివరీ చేస్తాయి.స్టాక్ ఉన్నంతవరకే లిమిటెడ్ ఆఫర్‌గా ఈ కాంబో డీల్ అందుబాటులో ఉంటుంది కాబట్టి కొనాలనుకునేవారు త్వరపడటం మంచిది.అలాగే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్, అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతున్నాయి.
వీటిలో ఉన్న ఆఫర్స్ కూడా చెక్ చేసుకోవడం ద్వారా కొనుగోలుదారులు తమకు బెస్ట్ అనిపించిన స్మార్ట్ వాచ్, ఇయర్ ఫోన్స్ కొనవచ్చు.







