వరంగల్ జిల్లాలో ఓ బీఆర్ఎస్ కార్పొరేటర్ పై భూ కబ్జా కేసు నమోదైంది.హన్మకొండ కాకతీయ కాలనీలో రూ.2 కోట్ల విలువైన భూమిని కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ కబ్జా చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.







