దిల్ రాజు నిర్మాణంలో సినిమా అంటే ఖర్చు విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటారు.అయితే రీసెంట్ గా ఆయన నిర్మాణంలో వచ్చిన వారసుడు సినిమాలో ఒక ఎపిసోడ్ మొత్తం వేస్ట్ గా తీసినట్టు తెలుస్తుంది.
ఆ ఎపిసోడ్స్ ఖర్చు అక్షరాల 10 కోట్లట.అదేంటి దిల్ రాజు అసలు అలా జరగనివ్వడు కదా అని అనుకోవచ్చు.
వంశీ పైడిపల్లి మీద నమ్మకంతో అక్కడ ఉంది కోలీవుడ్ స్టార్ హీరో కాబట్టి బడ్జెట్ లో రాజీ పడలేదు దిల్ రాజు.కానీ అవుట్ పుట్ చూసుకున్నాక ఒక ఎపిసోడ్ బాగా లేక ట్రిం చేసేశారు.
అయితే ఈ ఎడిటింగ్ లో ఖుష్బు సీన్స్ అన్ని ఎగిరిపోయాయి.ఖుష్బు సీన్స్ అన్ని వారసుడు సినిమాలో తీసేశారు.మరి చివరి నిమిషంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కానీ దిల్ రాజుకి ఈ ఎపిసోడ్స్ కోసం 10 కోట్ల దాకా ఖర్చు చేయించాడట వంశీ పైడిపల్లి.వారసుడు సినిమా తెలుగులో పెద్దగా హడావిడి చేయకపోయినా తమిళం లో మాత్రం అదరగొట్టేస్తుంది.150 కోట్ల కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది వారిసు.కోలీవుడ్ లో మాత్రం విజయ్ స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ చేసింది ఈ సినిమా.