జీవో నెంబర్.1 పై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.జీవో నెంబర్.1 పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సర్కార్ ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసింది.రాజకీయ పార్టీల రోడ్ షోలు, సభలు, సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ .1 ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.జీవోను వ్యతిరేకిస్తూ సీపీఐ రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం జీవోపై తాత్కాలికంగా స్టే విధించింది.ఈ క్రమంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది.







