ఖమ్మం జిల్లా కేంద్రంలో రేపు బీఆర్ఎస్ పార్టీ తొలి ఆవిర్భావ సభ జరగనుంది.ఈ భారీ బహిరంగ సభకు పలువురు ఏపీ నేతలు హాజరుకానున్నారు.
త్వరలో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆ పార్టీ నేత పార్థసారథి తెలిపారు.రేపటి ఖమ్మం సభ తర్వాత ఏపీపై దృష్టి సారిస్తామని వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఏపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని పేర్కొన్నారు.బీజేపీకి ఏపీలో సీరియస్ రాజకీయాలు చేసే ఉద్దేశ్యం లేదన్నారు.
కొన్ని రోజులు టీడీపీ.మరికొన్ని రోజులు వైసీపీకి కొమ్ముకాస్తారని విమర్శించారు.







