నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన వీర సింహా రెడ్డి సినిమా మొన్న సంక్రాంతి కి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని వీర సింహా రెడ్డి సినిమా సొంతం చేసుకుంటుందని ప్రతి ఒక్కరూ భావించారు.
కానీ ఫ్యాన్స్ ఆశలన్నీ అడియాశలు అయ్యాయి.అభిమానులను సంతృప్తి పరిచిన వీర సింహా రెడ్డి సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ని అందించడం లో విఫలమైందని చెప్పాలి.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన కలెక్షన్స్ మెల్ల మెల్ల గా కొనసాగుతున్నాయి.ఈ సమయం లో నందమూరి ఫ్యాన్స్ బాలకృష్ణ హీరో గా మరో సారి బోయపాటి సినిమా కావాలని కోరుకుంటున్నారు.
బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ మరియు అఖండ సినిమా లు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

కనుక బోయపాటి మరో సారి బాలకృష్ణ తో సినిమా చేసి అఖండ స్థాయి విజయాన్ని దక్కించుకోవాలని నందమూరి ఫ్యాన్స్ కోరిక తో ఉన్నారు.బాలకృష్ణ కు కేవలం బోయపాటి శ్రీను మాత్రమే సక్సెస్ ని ఇవ్వగలడు అని చాలా మంది నమ్ముతున్నారు.కనుక బాలకృష్ణ ఫ్యాన్స్ కోసం బోయపాటి ఎప్పుడు రెడీ అవుతాడు అనేది చూడాలి.

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ హీరో గా ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా చిత్రీకరణ మొదలైంది, మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయింది.దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా సంక్రాంతి సీజన్ లో రావడంతో మంచి కలెక్షన్స్ ను నమోదు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.







