చలికాలంలో మీ బైక్ నుంచి ఇలాంటి శబ్దాలు వస్తున్నాయా.. కారణం ఇదే?

బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు దాని కండిషన్ ఎలా ఉందో దాదాపు తెలిసిపోతుంది.అదెలాగంటే, ఏవైనా రిపేర్లు ఉంటే బండి సౌండ్ మారిపోతుంది.

 Does Your Bike Make Such Noises In Winter Is This The Reason, Bike, Bike Weird S-TeluguStop.com

తద్వారా బండి రిపేర్ చేయించుకోవాలని మీకు తెలుస్తుంది.అయితే చలికాలంలో బైకర్లను ఒక వింత సమస్య ఎప్పుడూ వేధిస్తుంటుంది.

అదేంటంటే, బైక్‌పై కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించి బైక్‌ను ఆపినప్పుడు టిక్ టిక్ అనే శబ్దం వినిపిస్తుంది.దీనివల్ల బైక్‌కి ఏమైనా అయిందా అని ఆందోళన కూడా నెలకొంటుంది.

నిజానికి ఈ సౌండ్ అనేది బైక్ సైలెన్సర్ నుంచి ఉత్పత్తి అవుతుంది.సాధారణంగా బైక్ కొంతసేపు నడిపిన తర్వాత దాని సైలెన్సర్ కాస్త వేడెక్కుతుంది.ఎండాకాలంలో అయితే ఈ సైలెన్సర్ చాలా నెమ్మదిగా చల్లారుతుంది.అదే చలికాలంలో అయితే ఇది వేగంగా చల్లబడుతుంది. అలా వేగంగా చల్లబడే సమయంలో ఈ టిక్ టిక్ అనే శబ్దం వినిపిస్తుంది.అంతే తప్ప బైక్‌కి ప్రత్యేకంగా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు.

అన్ని బైక్ సైలెన్సర్‌లలో కాటాలైటిక్ కన్వర్టర్ అమర్చుతారు.బైక్ కదులుతున్నప్పుడు, ఈ కన్వర్టర్ బాగా వేడెక్కి కాస్త ఉబ్బుతుంది.బైక్‌ను ఆపినప్పుడు అది చల్లబడుతూ మళ్లీ యధాస్థితికి చేరుకుంటుంది.అలా ఇది చిన్నగా అవుతున్న క్రమంలో టిక్ టిక్ మని శబ్దం వినిపిస్తుంది.

బైక్ సైలెన్సర్ నుంచి బయటికి వెలువడే హానికరమైన వాయువులను తగ్గించేందుకే కాటాలైటిక్ కన్వర్టర్ ఉపయోగిస్తారు.ఇది ఇంజన్ నుండి వచ్చే వాయువులను ఫిల్టర్ చేసి వాతావరణంలోకి ఎక్కువ హానికరమైన వాయువులు రాకుండా ఆపగలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube