ఏపీ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ కవిత..? ఖరారు చేయనున్న కేసీఆర్..!

సీఎం కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా.బీఆర్ఎస్ గా మారిన దగ్గిరి నుంచి జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టింది.

 Mlc Kavitha As Ap Coordinator For Cm Kcr Brs Party Details, Cm Kcr, Mlc Kavitha,-TeluguStop.com

ఇందులో భాగంగా.ఏపీలో ఇప్పటికే కొందరి నేతలను పార్టీలో చేర్చుకుంది.

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్థసారథి లాంటి నేతలకు కండువాలు కప్పడమే కాకుండా.తోట చంద్రశేఖర్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించేశారు.

ఇక ఇప్పుడు బీఆర్ఎస్ ఆవిర్భావ సభ పూర్తి కాగానే.అటు ఏపీపైనా ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు.

అందుకే ఢిల్లీలో పెట్టాల్సిన పార్టీ అవిర్భావ సభను ఖమ్మం జిల్లాకు మార్చినట్టు తెలుస్తోంది.ఏపీకి ఖమ్మం జిల్లా బార్డర్ జిల్లా కావడంతో.

అక్కడి నుంచి కూడా సభకు జనసమీకరణ చేయాలని కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది.అయితే పార్టీ పగ్గాలు తోట చంద్రశేఖర్ రావుకు అప్పగించినా.సమన్వయ కర్తను మాత్రం నియమించలేదు.దాంతో ఇప్పుడు స్వయానా తన కూతురు ఎమ్మెల్సీ కవితను ఏపీకి సమన్వయ కర్తగా పంపించేందుకు కేసీఆర్ చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఏపీ బీఆర్ఎస్ నేతలతో పాటు.దాసోజు శ్రవణ్ కూడా ఆమెతో విడిగా భేటీ అయ్యారు.

ఆమె ఏపీలోని స్థానిక పరిస్థితులను.రాజకీయ పరిస్థితులను ఏపీ బీఆర్ఎస్ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది.

Telugu Ap Brs, Brs, Cm Kcr, Ravela Kishore, Mlc Kavitha, Hasarathi, Thotachandr-

ఇక సంక్రాంతి తర్వాత ఎలాగూ ఏపీలో భారీ బహిరంగ సభకు నేతలు ఏర్పట్లు చేస్తున్నారు.అంత కంటే ముందే.ఖమ్మం సభలో ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఇక ఇప్పటికే కవిత ఏపీలో పర్యటించడానికి ఫిక్స్ అయ్యి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు.

ఎమ్మెల్సీ కవిత ఏపీ పర్యటన అనంతరం ఫిబ్రవరిలో కేసీఆర్ కూడా ఏపీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.అంతకంటే ముందే.

Telugu Ap Brs, Brs, Cm Kcr, Ravela Kishore, Mlc Kavitha, Hasarathi, Thotachandr-

ఏపీలోని అన్ని నియోజకవర్గాలలో కేడర్ ను పెంచుకుంటూనే.రాష్ట్ర కమిటీలను నియమించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.పార్టీలో చేరే వారికి ఆ కమిటీల్లో సముచిత స్థానం కల్పించాలని సైతం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఏపీలో ప్రధాన కార్యాలయం కోసం వెతుకుతున్నారు.అది దొరకగానే.భారీ స్థాయిలో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ భవనాన్ని స్వంతంగా నిర్మించుకునే చాన్స్ ఉంది.

మరి పోటీ కోసం ఇంతగా తాపత్రయ పడుతున్న బీఆర్ఎస్.రానున్న ఎన్నికల్లో స్వంతంగా పోటీ చేస్తుందా.? లేక ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube