తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయంకృషితో ఇండస్ట్రీలోఅంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది అభిమానులు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే.ఇలా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నటువంటి చిరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఇక ఈయన ఇప్పటికీ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి బుల్లితెర పై ప్రసారం అవుతున్న సుమా అడ్డా అనే కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ శ్రీ సత్య మెగాస్టార్ తో కలిసి ఒక ఫోటోని దిగడమే కాకుండా ఆయనకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.ఇక ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు.

మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమానిని తెలియజేయడమే కాకుండా ఆయనకు తన సినిమాల పేర్లతో ఒక అద్భుతమైన కవితలు రాసి ఉన్న ఫోటో తనకు బహుమతిగా ఇచ్చారు.చిరంజీవి గారిని కలుసుకోవడమే కాకుండా ఆయనకు బహుమతి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా చిరంజీవి గారితో కలిసి దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.







