సీరియల్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకునీ అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నటువంటి వారిలో హిమజ ఒకరు.ఈమె బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ అయినటువంటి హిమజ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అదేవిధంగా ఈమె పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.
ఇక ఈమె సంపాదన కూడా భారీగా పెరిగిపోయింది.

బిగ్ బాస్ తర్వాత ఈమె సొంతంగా ఇంటిని నిర్మించబోతుంది.అదేవిధంగా ఈమె ఇది వరకే ఖరీదైన కొత్త కారును కొనుగోలు చేశారు.అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈమె కియా కారును కొనుగోలు చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఈ సంక్రాంతికి నా ఫ్యామిలీని ఇలా సర్ ప్రైజ్ చేశాను.వారి సౌలభ్యమే నాకు ముఖ్యం.మీ అందరి ఆశీర్వాదం వల్లే ఇదంతా జరిగింది అంటూ ఈమె తన అభిమానుల పై ఉన్న ప్రేమను తెలియజేశారు.

ఇక ఈమె కొన్న కియా కారు సుమారుగా 40 నుంచి 50 లక్షల వరకు ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయ పడ్డారు.ఇక ఈమె కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు.ఇకపోతే గతంలో ఈమె పెళ్లి గురించి వార్తలు రావడంతో పెళ్లి వార్తలపై స్పందించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.







