బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శలు గుప్పించారు.కోజికోడ్ లో నిర్వహించిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పెద్ద సంఖ్యలో సీట్లను కోల్పోతుందని చెప్పారు.ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన బీజేపీ.వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో కూడా అధికారం కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు.2019 ఎన్నికల ఫలితాలను 2024లో పునరావృతం చేయడం బీజేపీకి సాధ్యం కాదని పేర్కొన్నారు.ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు కావాల్సి ఉండగా.వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఈ మార్కును అందుకోలేదని తెలిపారు.ఇది విపక్ష పార్టీలకు అవకాశంగా మారుతుందన్న శశిథరూర్ ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడితే బీజేపీని అధికారానికి దూరం చేయొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.







