తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటి ఉర్ఫి జావెద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఉర్ఫి జావెద్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె డ్రెస్సింగ్ స్టైల్.
చిత్ర విచిత్రమైన వస్త్రధారణ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఉర్ఫి జావెద్.ఆమె ధరించే బట్టలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆమె డ్రస్సు వేసుకుందా అన్న అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి.
ఉర్ఫి జావెద్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఆలోచిస్తూ కేవలం తన ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే కవర్ చేసుకునే విధంగా డ్రస్సులు ధరిస్తూ ఉంటుంది.వస్త్రధారణ విషయంలో సోషల్ మీడియాలో తరచూ నిలవడంతో పాటు ఎన్నో రకాల విమర్శలను నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఎవరు ఎన్ని విధాలుగా నెగిటివ్ కామెంట్స్ చేసినా కూడా అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది.ఇప్పటికే ఈమె తన డ్రెస్సింగ్ విషయంలో ఎన్నో రకాల కాంట్రవర్సీలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
తాజాగా ఆమె డ్రెస్సింగ్ పై మరొక వివాదం చెలరేగింది.ఉర్ఫి జావెద్ వస్త్రధారణ పై బిజెపి మహిళా నేత చిత్ర కిషోర్ వాఘ్ విమర్శలు చేయడంతో ఆమె వ్యాఖ్యల పట్ల ఆగ్రహించిన ఉర్ఫి జావెద్ మహారాష్ట్ర మహిళా కమిషన్ ను ఆశ్రయించింది.
తనపై ఘాటు విమర్శలు చేసిన బీజేపీ నేత పై ఫిర్యాదు చేసింది ఉర్ఫి జావెద్.బహిరంగంగా బెదిరింపులకు పాల్పడినందుకు హాని చేస్తానని బెదిరించినందుకు ఆమెపై చేసిన కేసు చేసింది.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సంబంధిత సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలి అని ఉర్ఫి జావెద్ తరపున న్యాయవాది అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఉర్ఫి జావెద్ తరపున న్యాయవాది మాట్లాడుతూ.ప్రజా హాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడినందుకు బీజేపీ మహిళా కార్యకర్త చిత్ర కిషోర్ వాఘ్ పై ఐపీసి లోని వివిధ సెక్షన్ల U/s 153(A)(B), 504, 506, 506(ii) కింద ఫిర్యాదు చేశాను.

ఆ మహిళ నేతపై ఐపిసి సెక్షన్ bunk km కింద ఫిర్యాదు చేసాము.మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రుపాలీ చకంకర్ ను కలిసి ఆ నేతకు వ్యతిరేకంగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు న్యాయవాది.ఏ విధంగా ఆ బిజెపి మహిళా నేత చిత్ర వాఘ్ వ్యాఖ్యల అనంతరం నటి ప్రాణాలకు ముప్పు ఉందని ఆమెకు రక్షణ కల్పించాలని కోరాను అని ఉర్ఫీ జావేద్ తరపున న్యాయవాది పేర్కొన్నారు.








