వారసుడు మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నేడు థియేటర్లో విడుదలైన సినిమా వారసుడు.విజయ్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమా కుటుంబ నేపథ్యంలో తెరకెక్కింది.

 Thalapathy Vijay Rashmika Mandanna Vaarasudu Movie Review And Rating Details, Va-TeluguStop.com

ఇక ఇందులో శరత్ కుమార్, సత్యరాజ్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, యోగి బాబు, శ్యామ్, ఖుష్బూ తదితరులు కూడా ప్రధాన పాత్రలో నటించారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్స్ పై దిల్ రాజ్, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ఈ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.

ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా.కార్తీక్ పళని సినిమాటోగ్రఫీగా చేసాడు.

ఇక ఈ సినిమా తమిళ భాషలో రూపొందగా నిన్న తమిళ భాషలో విడుదల అయింది.ఈరోజు తెలుగులో విడుదల అయింది.

ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో.విజయ్ కు ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.

కథ:

శరత్ కుమార్ అనే పెద్ద వ్యాపారవేతకు ముగ్గురు కొడుకులు ఉంటారు.అయితే చిన్న కొడుకు విజయ్ రాజేందర్ మాత్రం తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు.

  మొదటి ఇద్దరు కొడుకులు శ్రీకాంత్, షామ్ మాత్రం తమ తండ్రికి వారసులం తామే అని ఆయన చెప్పినట్లే వింటారు.ఇక విజయ్ మాత్రం కొన్ని వ్యవహారాల వల్ల ఇంటి నుండి వెళ్లిపోతాడు.

Telugu Prabhu, Prakash Raj, Sarath Kumar, Sathyaraj, Vaarasudu, Vaarasudu Story,

అలా వారికి దూరంగా ఉండగా.ఏడేళ్లుగా ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నాడు.ఇక తిరిగి తన ఇంటికి వచ్చేస్తాడు.ఇక ఆ సమయంలో తమ కుటుంబ సభ్యులకు ఒక సమస్య ఎదురవుతుంది.అంతేకాకుండా తను చేసే  వ్యాపారంలో కూడా సమస్యలు వస్తుంటాయి.దీంతో ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు అనేది.తన కుటుంబంను సమస్యల నుండి ఎలా బయటికి తీసుకొస్తాడు అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

విజయ్ తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు.ముఖ్యంగా తన పాత్రలో లీనమయ్యాడు.నిజానికి సినిమాను తన భుజాలపై మోసాడని చెప్పవచ్చు.ఇక రష్మిక మందన నిడివి తక్కువ అయినప్పటికీ కూడా బాగా ఆకట్టుకుంది.మిగతా నటినటులంతా తమ పాత్రకు తగ్గట్టుగా న్యాయం చేస్తారు.

Telugu Prabhu, Prakash Raj, Sarath Kumar, Sathyaraj, Vaarasudu, Vaarasudu Story,

టెక్నికల్:

డైరెక్టర్ ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో మంచి కంటెంట్ అందించాడు.తమన్ అందించిన   సంగీతం పర్వాలేదు.సినిమాటోగ్రఫీ బాగుంది.మిగిలిన సాంకేతిక విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పని చేశాయి.

విశ్లేషణ:

డైరెక్టర్ సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు మంచి సినిమాను అందించాడు.ఇక ఒక తండ్రి, కొడుకు మధ్య ఉన్న వ్యతిరేక భావాన్ని అద్భుతంగా చూపించాడు.

కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని వదిలేయకుండా ఆ కొడుకు వారిని ఎలా కాపాడాడు అనే కంటెంట్ బాగా చూపించాడు.

Telugu Prabhu, Prakash Raj, Sarath Kumar, Sathyaraj, Vaarasudu, Vaarasudu Story,

ప్లస్ పాయింట్స్:

విజయ్ పాత్ర, సెంటిమెంట్ సీన్స్, ఫస్టాఫ్, స్టోరీ, సినిమాటోగ్రఫీ.

మైనస్ పాయింట్స్:

కొన్ని సన్నివేశాలు నిదానంగా సాగవు.కొన్ని సన్నివేశాలు రొటీన్ గా అనిపించాయి.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

రేటింగ్: 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube