తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఎస్ రాజమౌళి క్రేజ్ ఏంటో మనకు తెలిసిందే.బాహుబలి సినిమాతో ఈయన పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడుగా గుర్తింపు పొందగా RRR సినిమాతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడుగా గుర్తింపు పొందడమే కాకుండా ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్ ఫిలిం సర్కిల్ నుంచి కూడా అవార్డు అందుకున్నారు.
ఇలా అంతర్జాతీయ స్థాయిలో జక్కన్న గురించి ఎంతోమంది ప్రశంశలు కురిపిస్తూ ఉండగా ఒక నెటిజన్ మాత్రం రాజమౌళికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.ఇలా నెటిజన్ రాజమౌళికి వార్నింగ్ ఇవ్వడం ఏంటి? అసలు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అనే విషయానికి వస్తే….రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన RRR సినిమా అన్ని భాషలలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి ఆదరణ సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ పై ఒక నెటిజెన్స్ స్పందిస్తూ రాజమౌళికి ఏకంగా వార్నింగ్ ఇచ్చేసారు.
ఈ సందర్భంగా సదరు నెటిజన్ స్పందిస్తూ….ఏరా జక్కన్న హిందీ వర్షన్ లో కూడా కొన్ని సన్నివేశాలలో అన్నా అని పెట్టడం అంత అవసరమా.

ఈ సినిమా చూసిన తర్వాత మా ఫ్లోర్ లో ఉండే ఒక నేపాల్ అమ్మాయికి ఆ పదం చాలా బాగా నచ్చడంతో ఏకంగా తను నన్ను అన్నా అని పిలుస్తా అంటుందంటూ నేటిజన్ రాజమౌళికి వార్నింగ్ ఇస్తూ కామెంట్ చేశారు.అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే కొందరు ఈ కామెంట్ ఫన్నీగా తీసుకోగా మరికొందరు దర్శకుడుని పట్టుకొని ఏరా అన్నందుకు సదరు నెటిజన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.







