అభిమానులు దర్శకులై తీసిన సినిమాలు.. వాళ్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో కామన్ పాయింట్లు ఇవే?

టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన గోపీచంద్ మలినేని డాన్ శీను సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే.

 Common Points In Sankranthi Movies Veera Simha Reddy And Waltair Veerayya ,veera-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాలో బాలయ్య బాబు హీరోగా నటించిన శృతిహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

అయితే గోపీచంద్ మలినేని బాలయ్యకు వీరాభిమాని.ఈ విషయాన్ని గోపీచంద్ మలినేని కూడా పలు సందర్భాలలో చెప్పుకొచ్చాడు.

Telugu Balakrishna, Bobby, Chiranjeevi, Shruti Haasan, Tollywood-Movie

ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక కంటితో అభిమానిగా మరొక కంటితో దర్శకుడిగా బాలయ్యను చూశాను అని ఆనందం వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.తన అభిమాని హీరోతో సినిమా చేయడం చాలా గొప్ప విషయం గర్వంగా ఉంది అని బాలకృష్ణ కూడా తెలిపిన విషయం తెలిసిందే.ఇకపోతే దర్శకుడు బాబీ విషయానికి వస్తే బాబీ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా వాల్తేరు వీరయ్య.ఈ సినిమాలో చిరంజీవి శృతిహాసన్ జంటగా నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న విడుదల కానుంది.కాగా బాబీ కూడా చిరంజీవికి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.

Telugu Balakrishna, Bobby, Chiranjeevi, Shruti Haasan, Tollywood-Movie

అదే విషయాన్ని బాబి పలు సందర్భాలలో చెప్పుకొచ్చాడు.గోపీచంద్ మలినేని లాగే బాబి కూడా తన అభిమాని హీరో అయినా చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.ఈ రెండు సినిమాలలో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే.అలాగే ఈ రెండు సినిమాలకు సంబంధించిన మరొక విషయం ఏమిటంటే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ రెండు సినిమాలను నిర్మించారు.

వాళ్తేరు వీరయ్య సినిమాని 140 కోట్లు పెట్టి నిర్మించగా వీరసింహారెడ్డి సినిమాను 110 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.ఈ రెండు సినిమాలు కేవలం ఒక్కరోజు తేడాతో విడుదలవుతున్న విషయం మనం అందరికీ తెలిసిందే.

ఇప్పటికీ వీర సింహారెడ్డి సినిమా విడుదల కాగా రేపు అనగా జనవరి 13న వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube