టాలీవుడ్ హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలకృష్ణకి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.
రెండు తెలుగు రాష్ట్రాలలో బాలకృష్ణకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలు కూడా బాలయ్య బాబు కు అభిమానులే అని చెప్పవచ్చు.
ఇకపోతే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి.ఈ సినిమా ఈరోజు అనగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.ఇప్పటికీ సినిమాపై భారీగా అంచనాల నెలకొన్న విషయం తెలిసిందే.కాగా సినిమా విడుదలకు ముందు బాలయ్య బాబు సినిమా నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్లో ట్రెండింగ్ అయ్యాయి.
ఆ సినిమాలోని పాటలకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా రీల్స్ చేసి అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.కాగా బాలయ్య బాబు సినిమాలో సుగుణ సుందరి, మా బావ మనోభావాలు పాటలకు ఇప్పటికే ఎన్నో రకాల రిల్స్ ని చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.

సెలబ్రిటీలు కూడా ఈ పాటలకు స్టెప్పులు వేశారు.తాజాగా మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా బాలయ్య బాబు సినిమాలోని మా బావ మనో బావలు అనే పాటకు స్టెప్పులను ఇరగదీసింది.బాలయ్య బాబు ఇంతకు ముందు సినిమా అఖండ లో జై బాలయ్య అనే పాటకు మంచు లక్ష్మీ డాన్స్ వేసిన విషయం తెలిసిందే.

అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.తాజాగా కూడా మా బావ మనోభావాలు అనే పాటకు స్టెప్పులను వేసి అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఆ వీడియో చూసిన బాలయ్య బాబు అభిమానులు మంచు అభిమానులు ఆ వీడియో పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇకపోతే బాలయ్య బాబు నటించిన వీర సింహారెడ్డి సినిమా విషయం కొస్తే.విడుదల కాబోతున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. శృతిహాసన్ బాలయ్య బాబు సరసన నటించింది.







