గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ సినిమాగా రూపొందిన సినిమా వీర సింహారెడ్డి.నందమూరి బాలయ్య, శృతిహాసన్, హనీ రోజ్ హీరో హీరోయిన్ లుగా నటించగా.
వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో నటించారు.వీళ్ళే కాకుండా లాల్, బి.ఎస్ వినాష్, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, మురళి శర్మ, రవి శంకర్, సప్తగిరి తదితరులు నటించారు.ఇందులో బాలయ్య రెండు పాత్రలలో నటించాడు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమాకు ఎస్.థమన్ సంగీతం అందించాడు.రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు వెలువడ్డాయి.ఫుల్ మాస్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
ఈ సినిమా కథ ఒక అన్నపై చెల్లెళ్లు పెంచుకున్న కోపం, పగ నేపథ్యంలో రూపొందింది.ఇక వీరసింహారెడ్డి (బాలయ్య), భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) ఇద్దరూ ఒకే తండ్రి పిల్లలు కానీ వీరి తల్లులు వేరు.అయిన కూడా వీరసింహారెడ్డి చెల్లెపై బాగా ప్రేమ చూపిస్తాడు.అయితే భానుమతి తను ప్రేమించిన వ్యక్తిని తన అన్నయ్యనే స్వయంగా చంపించాడని ఆమె గట్టిగా నమ్ముతుంది.దీంతో తన అన్నపై వీరసింహరెడ్డి పై పగ సాధించడానికి తన అన్నకు పడని వ్యక్తి ప్రతాప్ రెడ్డిని పెళ్లి చేసుకుంటుంది.అయినా కూడా వీరసింహారెడ్డి అనుమతికి ప్రతి ఏటా పండుగ రోజుల్లో సారె, చీరె పంపుతూనే ఉంటాడు.
కానీ భానుమతి తన అన్న ను చంపాలని పగ మీద ఉంటుంది.అందరూ దేవుడుగా భావించే వీరసింహారెడ్డిని ఇక్కడ చంపడం కష్టమని అనుకున్న భానుమతి తన అన్న విదేశాలకు వెళ్లగా అక్కడే నమ్మించి చంపేస్తుంది.
ఇక చివరికి భానుమతి తన అన్న గురించి ఏం తెలుసుకుంటుంది.వీర సింహారెడ్డి విదేశాలకు ఎందుకు వెళ్లాల్సి ఉంటుందనేది.బాలయ్య నటించిన మరో పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ లోనిది.
నటినటుల నటన:
బాలయ్య నటన మాత్రం పూనకాలు తెప్పించాయని చెప్పాలి.రెండు పాత్రలలో బాలయ్య ఫిదా చేశాడు.వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం తన నెగటివ్ రోల్ తో అదరగొట్టింది. శృతి హాసన్, హనీ రోజ్ ల పాత్రల నిడివి కొద్దిసేపు అయినప్పటికి తమ పాత్రలకు న్యాయం చేశారు.మిగతా నటి నటులు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
డైరెక్టర్ రొటీన్ కథ అందించినప్పటికి కూడా అద్భుతంగా చూపించాడు.థమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.ఇక రిషి పంజాబీ అందించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.ఎడిటింగ్ లో ఎటువంటి లోపాలు కనిపించలేదు.మిగిలిన సాంకేతిక విభాగం మూవీకి తగ్గట్టుగా పనిచేశాయి.
విశ్లేషణ:
సినిమా కథ రొటీన్ అనిపించినప్పటికీ కూడా బోర్ లేకుండా చూపించాడు డైరెక్టర్.ఇక బాలయ్యను రెండు పాత్రలకు తగ్గట్టుగా యాక్షన్ సన్నివేశాలతో ఫిదా చేశాడు.
క్లైమాక్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
బాలయ్య నటన, వరలక్ష్మి నెగటివ్ రోల్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్, యాక్షన్స్ సీన్స్, ఎమోషనల్ సీన్స్.
మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ లాగా ఉంది.
బాటమ్ లైన్:
మాస్ యాక్షన్స్ తో అదరగొట్టేసిన బాలయ్య.రొటీన్ కథ అయినప్పటికీ కూడా ప్రేక్షకులను ఫిదా చేశాడు బాలయ్య.
రేటింగ్:
2.5/5