చిరు మరియు చరణ్ ను మళ్లీ కలిపి చూపించే ప్రయత్నాలు జరిగేనా?

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా లో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే.రామ్‌ చరణ్ పాత్ర ను మొదట చిన్నగా అనుకున్నప్పటికి ఆ తర్వాత పెంచారు.

 Chiranjeevi And Ram Charan Fans One More Combo Movie ,chiranjeevi,ram Charan,meg-TeluguStop.com

సురేఖ గారి యొక్క కోరిక మేరకు రామ్‌ చరణ్ మరియు చిరంజీవి కలిసి నటించారు.ఆచార్య సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఆచార్య సినిమా విషయంలో చిరంజీవి చాలా చింతిస్తున్నట్లుగా కామెంట్స్ చేయడం జరిగింది.

కొరటాల శివ పై నమ్మకం పెట్టుకుని ఆ సినిమా చేస్తే ఇలా అయ్యింది అంటూ చాలా సందర్భాల్లో మెగా ఫ్యాన్స్ సినిమా విషయంలో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.కొరటాల శివ పై నమ్మకంతో రామ్‌ చరణ్‌ కూడా ఈ సినిమా లో నటించారు.చిరంజీవి మరియు రామ్‌ చరణ్ కలిసి నటించిన సినిమా ను మెగా ఫ్యాన్స్ ఎప్పటికి కూడా గుర్తు పెట్టుకునేలా ఉంటే బాగుండేది.

కానీ ఆచార్య సినిమా గుర్తు పెట్టుకునే విధంగా ఫలితాన్ని సాధించలేదు.

బాబోయ్‌ ఇదేం సినిమా అన్నట్లుగా మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.మళ్లీ చిరంజీవి మరియు రామ్‌ చరణ్ కలిసి నటించాలని చాలా మంది కోరుకుంటున్నారు.అందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మెగా కాంపౌండ్ ద్వారా వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తో ఒక స్టార్‌ దర్శకుడు సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు.ఆ సినిమాలో చిరంజీవి కీలక పాత్రలో నటించేలా ప్లాన్ చేస్తున్నాడట.

కానీ ఆ సినిమా పట్టాలెక్కాలి అంటే 2025 సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సి ఉంది.ప్రస్తుతం చరణ్ చాలా సినిమాలకు కమిట్ అయ్యాడు.

ఆ సినిమా కన్ఫర్మ్‌ అయ్యి.కథ ఓకే అయితే అప్పుడు పట్టాలెక్కే అవకాశం ఉంది.

అందుకు చాలా సమయం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube