తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన తాజాగా మ్యూజిక్ కంపోజ్ చేసిన వరిసు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో నేడు విడుదల కావాల్సి ఉండగా తెలుగులో వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమాని జనవరి 14వ తేదీకి వాయిదా వేశారు.
ఇక తమిళంలో ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ అయింది ఇక ఇందులో రంజితమే అనే సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఇక ఈ సినిమా థియేటర్లో ప్రసారమవుతు ప్రేక్షకులను ఎంతో సందడి చేయడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి తమన్ థియేటర్లోనే ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈయన ఇదివరకు ప్రమోషన్ కార్యక్రమాలలో విజయ్ కు పెద్ద అభిమానిని చెప్పుకొచ్చారు.తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి దిల్ రాజు వంటి ఇతర చిత్ర బృందంతో కలిసి ఈ సినిమా చూసినటువంటి తమన్ కంట్రోల్ చేసుకోలేక కంటతడి పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అలాగే తమన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.

విజయ్ అన్న సినిమాలోని ఎమోషన్స్ సీన్స్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాను.కన్నీళ్లు చాలా విలువైనవి ఈ సినిమా నా హృదయాన్ని హత్తుకుంది.ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ లవ్ యు అన్నా అంటూ తమన్ చేసినటువంటి ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈయన సంగీత దర్శకత్వం వహించిన వీరసింహారెడ్డి సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి.







